*మేలో జనం ముందుకు ఎల్టీటీఈ ప్రభాకరన్?*
*తమిళ మీడియాలో కథనాలు*
శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలమ్ కోసం పోరాడిన…నిషేధిత తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ జీవించేవున్నారా? త్వరలోనే జనం ముందుకు రానున్నారా?.. అవునంటోంది తమిళ మీడియా. మే నెలలో ఆయన జనం ముందుకు రానున్నారంటూ సోమవారం కొన్ని తమిళ పత్రికలు కథనాలు ప్రచురించాయి. శ్రీలంక సైన్యంతో జరిగిన పోరులో 2009 మే మాసంలో ప్రభాకరన్ మృతి చెందినట్టు సింహళ సైన్యం ఫోటోలను కూడా విడుదల చేసింది. ప్రభాకరన్ మృతి చెందినట్టు ప్రపంచమంతా భావిస్తున్నా.. ఎల్టీటీఈ సానుభూతిపరులైన తమిళ విమోచనోద్యమ నేత పి.నెడుమారన్ వంటి తమిళ రాజకీయ నేతలు మాత్రం ఆయన బతికే ఉన్నాడంటూ అడపాదడపా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే… ప్రభాకరన్, అతడి కుడిభుజంగా వ్యవహరించిన పొట్టు అమ్మన్‌కూడా మే నెలలో జనం ఎదుటకు రానున్నారంటూ తాజాగా కథనాలు వెలువడ్డాయి..