పోరాడి గెలిచిన లక్నో సూపర్ జేయింట్స్

*పోరాడి గెలిచిన లక్నో సూపర్ జేయింట్స్*

*హైదరాబాద్:ఏప్రిల్ 20*

ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో లక్నో జట్టు విజయం సాధించింది.

లక్నో బౌలర్ ఆవేష్ ఖాన్ చివరి ఓవర్ అద్భుతంగా వేశాడు. కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టడంతో మ్యాచ్ లక్నో జట్టు సొంతమైంది. అయితే, మ్యాచ్ అనంతరం ఆవేష్ ఖాన్ మాట్లాడుతూ..

మ్యాచ్ గెలిచినప్పటికీ విజయోత్సవ సంబురాలు చేసుకోలేక పోయానని అన్నారు.చివరి ఓవర్ ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బాల్ వరకు ఇరు జట్ల మధ్య గెలుపు దోబూచులాడింది.

చివరి ఓవర్లో ఆర్ఆర్ జట్టు విజయానికి తొమ్మిది పరుగులు అవసరం. లక్నో జట్టు బౌలర్ ఆవేష్ ఖాన్ బౌలింగ్ చేశాడు. ధ్రువ్ జురెల్, హెట్మైర్ క్రీజులో ఉన్నారు. తొలి బంతికి ధ్రువ్ జురెల్ సింగిల్ తీశాడు. రెండో బంతికి హెట్మైర్ రెండు పరుగులు తీయగా.. మూడో బంతికి శార్దూల్ ఠాకూర్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

శుభమ్ దూబే క్రీజులోకి వచ్చాడు. నాల్గో బంతికి పరుగులు రాలేదు. ఐదో బంతికి శుభమ్ దూబే రెండు పరుగులు తీశాడు. చివరి బంతిని దూబే స్టెయింగ్ గా బంతిని బలంగా కొట్టాడు. బౌలర్ ఆవేష్ ఖాన్ చేతిని అడ్డుపెట్టి ఆపాడు. దీంతో అతని చేతికి స్వల్ప గాయమైంది.

మ్యాచ్ అనంతరం ఆవేష్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘నా చేయి బాగానే ఉంది. విరిగిందని అనుకున్నా. ఎముకకు తగిలింది. నేను విజయోత్సవ సంబరాలు కూడా చేసుకోలేకపోయా. యార్కర్ నా బలం, నేను దానిని అమలు చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను.

చివరి ఓవర్లో నా మనస్సు లో కొన్ని సందేహాలు ఉన్నాయి. అవుట్ సైడ్ ఎడ్జ్ లేదా ఇన్ సైడ్ ఎడ్జ్ వేస్తే బౌండరీకి వెళ్లొచ్చు. మిడిల్ లెగ్ లో యార్కర్ వేయా లని అనుకున్నా. నేను జట్టు గురించి ఆలోచిస్తాను. మిగిలిన మ్యాచ్ లలోనూ ఇదేవిధంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తాను’’ అని ఆవేష్ ఖాన్ అన్నాడు.

Join WhatsApp

Join Now