అలై బలై కార్యక్రమంలో పాల్గొన్న ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు

అలై బలై కార్యక్రమంలో పాల్గొన్న ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రశ్న ఆయుధం, అక్టోబరు 16: కూకట్‌పల్లి ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అలై బలై కార్యక్రమంలో పాల్గొన్న కూకట్పల్లి ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరుకల సంఘం ఆత్మగౌరవ భవనంలో మాధవరం కృష్ణారావు ని శాలువతో ఘనంగా సన్మానించారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఎరుకల కులస్తుల కోసం ఆత్మగౌరవ భవనం నిర్మించుకునేందుకు భూమిని కేటాయించడంతో పాటు భవన్ నిర్మాణానికి సహకారం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. అలై బలై వంటి కార్యక్రమాలతో అన్ని రంగాలవారినీ ఆహ్వానించి సత్కరించడం అభినందనీయమని మాధవరం కృష్ణారావు అన్నారు. కార్యక్రమంలో ఎరుకల సంఘం రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment