మెదక్ సబ్ రిజిస్ట్రార్ గా ఎం. శ్రీలత శనివారం బాధ్యతలు చేపట్టారు.కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ గా రెండున్నర సంవత్సరాలు పనిచేసిన శ్రీలత రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా మెదక్ సబ్ రిజిస్ట్రార్ గా బదిలీ పై వచ్చారు. ఇప్పటివరకు మెదక్ లో సబ్ రిజిస్ట్రార్ గా పని చేసిన శ్రీలత సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ గా బదిలీ పై వెళ్లారు. నూతనగా బదిలీపై వచ్చిన సబ్ రిజిస్ట్రార్ శ్రీలత మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ లు చేయడం జరుపుతామని తెలిపారు. ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ల కు ఎలాంటి ఆస్కారం లేదన్నారు.అసైన్డ్, ఇరిగేషన్,వక్ఫ్, మున్సిపల్, దేవాదాయ పోరంబోకు భూములకు రిజిస్ట్రేషన్ లు చేయడం కుదరదని తెలిపారు.రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలకు లోబడి పనులు జరుగుతాయన్నారు. ఆఫీసులో ఉండే ఉద్యోగులు సిబ్బంది అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఉద్యోగులంతా సమయపాలన పాటించాలని ఆమె ఆదేశించారు. అక్రమ రిజిస్ట్రేషన్ల పై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఉద్యోగులు, సిబ్బంది సమన్వయం తో ముందుకు సాగుతానని ఆమె స్పష్టం చేశారు.
Latest News
