అంబేద్కర్ కి ఘన నివాళి..ఎం శ్రీనివాస్ కుమార్

*అంబేద్కర్ కి ఘన నివాళి* .

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రముఖ వ్యాపారి సామాజికవేత ఎం శ్రీనివాస్ కుమార్ ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఒక సంఘసంస్కర్త సామాజికవేత్త ఆర్థికవేత న్యాయ కోవిదుడు స్వాతంత్ర ఉద్యమకారుడు రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్ మొదటి న్యాయ శాఖ మంత్రి భారతరత్న ప్రపంచ మేధావి అణగారిన వర్గాల కొరకు అహర్నిశలు కృషి చలిపిన వ్యక్తి సమ సమాజ నిర్మాణం కొరకు అహర్నిశలు కృషి చేసిన మహానీయుడు అని కొనియాడారు. సాంఘిక అసమానతలు వివక్ష అంటరానితనము అనేక సామాజిక అసమానతలను ఎదుర్కొని తరగతి బయట నుండి విద్యనభ్యసించి ఒక విద్యావేత్తగా దేశ విదేశాలలో విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించి రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్గా భారతీయ రుగ్మతలను తొలగించుట కొరకు సమ సమాజ నిర్మాణం కోసం అనేక సంస్కరణలు ఆర్టికల్లు ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని నిర్మించి తద్వారా సమాజ అభ్యున్నతికి సామాజిక న్యాయానికి ఆదేశిక సూత్రాలను ప్రాథమిక సూత్రాలు ప్రాథమిక విధులు రాజ్యాంగంలో పొందుపరిచి తద్వారా పౌరులందరికీ ఒకే విధమైన న్యాయాన్ని కల్పించుట కొరకు సామాజిక న్యాయాన్ని ప్రజలకు సమాజానికి చేరవేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.

Join WhatsApp

Join Now

Leave a Comment