వార్డు సభ్యుని నుండి జెడ్.పీ. ఛైర్మెన్ వరకు అన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలి..

వార్డు

Headlines :

  • మాచారెడ్డి మండలంలో బీజేపీ కార్యవర్గ సమావేశం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయంపై కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సూత్రధారణ
  • ప్రతి బీజేపీ కార్యకర్త 100 క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేయాలి
  • 100 ప్రాథమిక సభ్యత్వాలు పూర్తి చేసిన వారికి క్రియాశీల సభ్యత్వం అందజేత
  • ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నాయకులు కృషి చేయాలి
వార్డు సభ్యుని నుండి జెడ్.పీ.
ఛైర్మెన్ వరకు అన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలి..

-ప్రజల మధ్యలో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి
 

-మండలానికి 100 మంది క్రియాశీల సభ్యులుగా చేరాలి

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి
ప్రశ్న ఆయుధం నవంబర్ 01:

కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని మాచారెడ్డి మండల బీజేపీ కార్యవర్గ సమావేశం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో వార్డు సభ్యుని నుండి జెడ్.పీ. ఛైర్మెన్ వరకు అన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలనీ అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త ప్రజల మధ్యలో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలనీ అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియనుందని క్రియా శిల సభ్యత్వం కోసం ప్రతి బీజేపీ నాయకుడు 100 సభ్యత్వాలు చేసి క్రియాశీల సభ్యత్వము తీసుకోవాలని అన్నారు. మండలానికి 100 మంది క్రియాశీల సభ్యులుగా చేరాలనీ అన్నారు.
కార్యక్రమం అనంతరం మండలానికి సంబంధించి 100 ప్రాథమిక సభ్యత్వాలు పూర్తి చేసిన 24 మందికి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు క్రియాశీల సభ్యత్వం అందజేయటం జరిగింది.

Join WhatsApp

Join Now