ఆకస్మికంగా తనిఖీ చేసిన మాచారెడ్డి చెక్ పోస్ట్: జిల్లా ఎస్పీ
ప్రజల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి
జిల్లా ఎస్పీ M రాజేష్ చంద్ర IPS
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా డిసెంబర్ 02
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ M రాజేష్ చంద్ర IPS ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా వాహనాల తనిఖీ సంబంధించిన రిజిస్టర్, రికార్డులను పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సూచనల్లో భాగంగ ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, అక్రమ మధ్యం, నిషేధిత వస్తువులు రవాణా ఎక్కువగా జరుగుతాయని గుర్తు చేస్తూ చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటుచేసిన భారీ గేట్లను సక్రమంగా వినియోగిస్తున్నారా అని ప్రతి వాహనాన్ని పద్ధతిగా, క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. డ్యూటీ రోస్టర్ ప్రకారం పోలీస్ సిబ్బంది క్రమబద్ధంగా విధులు నిర్వహించాలని, వాహనాలను, అనుమానస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.
స్థానిక ఎన్నికల సందర్భంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహణకు పోలీస్ శాఖ కృషి చేయాలని అన్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ను పగటి బందీగా అమలు చేయాలని, ఫ్లైయింగ్ స్కార్డ్స్, చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి ఎన్నికలు ముగిసేంతవరకు బృందాలు 24/7 తనిఖీలు కొనసాగిస్తాయని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ పరిశీలన సందర్భంగా మాచారెడ్డి ఎస్సై, చెక్ పోస్ట్ విధుల్లో ఉన్న సిబ్బంది పాల్గొన్నారు.