లోకల్ బాడీ అదనపు కలెక్టర్‌గా మదన్ మోహన్ బాధ్యతలు స్వీకరణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 1
జిల్లా రెవెన్యూ అధికారి మదన్ మోహన్‌కు ఇంచార్జ్ లోకల్ బాడీ అదనపు కలెక్టర్ (ACLB) బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శనివారం మదన్ మోహన్ కొత్త బాధ్యతలను స్వీకరించి, కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మదన్ మోహన్‌ను సూచించారు. జిల్లాలో ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వందశాతం పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సంక్షేమం కోసం లోకల్ బాడీ విభాగం సమన్వయంతో సమర్థవంతంగా పని చేయాలని కలెక్టర్ సూచించారు.