*బంజారా సాంప్రదాయ పండుగలో హోలీ లెంగి కార్యక్రమంలో చిందేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్*
ఆయుధం న్యూస్ మార్చ్ 11 కామారెడ్డి జిల్లా గాంధారి
గాంధారి మండల కేంద్రంలో గిరిజనుల పండుగలో ముఖ్యమైన హోలీ లేంగి పండగ శుభాకాంక్షలు తెలిపి గిరిజనులతో పాటు నృత్యం చేసి అందరిని నృత్యంతో ఆకట్టుకున్న ఎమ్మెల్యే…. వివరాల్లోకి జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడిసమీపం లో బంజారా సాంప్రదాయ పండగలలో ఒకటైన హోలీ లెంగీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు . గిరిజనుల సాంప్రదాయ దుస్తులు ధరించి నాట్యం చేశారు . దీంతో ఎమ్మెల్యే నాట్యం చేయడంతో గిరిజనులు తమ సంతోషం వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా రాష్ట్ర బంజారా సంఘం అధ్యక్షుడు తాన్ సింగ్ మాట్లాడుతూ పిలవగానే ఎమ్మెల్యే వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా గిరిజనుల సాంప్రదాయ పండుగ అయిన శివరాత్రి మొదలుకొని 15 రోజులపాటు ఉపవాసం ఉండడం జరుగుతుందని తెలిపారు.ఎక్కడెక్కడ నుంచో నియోజకవర్గంలోని అనేకమంది గిరిజనులు కలిసి రావడం చాలా సంతోషంగా ఉందని ఇందుకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అధ్యక్షులు, గాంధారి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు,బంజారా సోదరులు తదితరులు పాల్గొనడం జరిగింది.