*
*ఆపదలో ఉన్న పేదవాన్ని దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి*
మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి,గుండె జబ్బు రోగిని ఆదుకోవాలి అన్నారు.
అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్!
గుండె జబ్బు తీవ్రతతో బాధపడుతున్న భూక్య రాజేష్ కు , అతి త్వరలో గుండె ఆపరేషన్ అత్యంత అవసరమై ఉన్నదని, దాతృత్వం దయాగుణం కలిగిన దాతలు, మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పెద్దలు,గిరిజన పెద్దలు, ముందుకు వచ్చి,ఆర్థిక సహాయాన్ని అందించి, ఒక ప్రాణాన్ని నిలబెట్టేందుకు మానవత్వాన్ని చాటాలని అన్నారు. అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు,భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు,కవి,సినీగీత రచయిత గాయకులు, సమాజసేవకులు,గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ పిలుపునిచ్చారు.
మంగళవారం మేదర బస్తీలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ ముందుగల చిన్న ఇంటిలో నివాసముంటున్న భూక్య రమేష్ ఆటో నడుపుకొని జీవనం సాగించేవాడు, గత సంవత్సర కాలంగా అనారోగ్యంతో ఆటో నడుపుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఇల్లు గడవడం కష్టమైన పరిస్థితుల్లో వృద్దురాలైన వాళ్ళ అమ్మ ఇండ్లలో పాచి పని చేస్తూ
కుటుంబాన్ని నడిపిస్తున్నది,వాళ్ల నాన్న బిక్కు రిక్షా తొక్కేవాడు , ఆయన చనిపోయి చాలా కాలం అయింది. ఇక భూక్య రమేష్ గుండెజబ్బుతో మంచాన పడి బాధపడుతుoడగా
తెలుసుకున్న ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ వాళ్ళ ఇంటికి వెళ్లి,రోగిని దర్శించి మనోధైర్యం కల్పించి రూ,,5000 రూపాయలను తక్షణ సహాయంగా అందించి, మానవత్వాన్ని చాటుకున్నారు.
గుండె ఆపరేషన్ కై, భూక్య రాజేష్ కు,ఆర్థిక సహాయం అందించి , ఒక ప్రాణాన్ని నిలబెట్టాలని స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు, రాజకీయ నాయకులు, ముందుకు రావాలని ఆచార్య డాక్టర్ మద్దెల అందరికీ విజ్ఞప్తి చేశారు.
భూక్య రాజేష్ సెల్ -93478 39198 ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ సెల్- 733 7500 950