కామారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా మద్ది చంద్రకాంత్ రెడ్డి
ప్రశ్న ఆయుధం న్యూస్,అక్టోబర్ 07,బిక్కనూరు/కామారెడ్డి:
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలోని రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన మద్ది చంద్రకాంత్ రెడ్డి నూతనంగా గ్రంధాలయ చైర్మన్ గా ఎన్నికయ్యారు. గ్రంధాలయ చైర్మన్ గా ప్రభుత్వం ఆయనను నియమించిందని ఒక ప్రకటనలో తెలిపారు. చైర్మన్ పదవిలో చంద్రకాంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఉంటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రంథాలయాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేస్తామని మద్ది చంద్రకాంత్ రెడ్డి తెలియజేశారు.