జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ తో కలిసి కెపిహెచ్‌బి అలానే ఫతేనగర్ డివిజన్ లలో పర్యటించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ప్రశ్న ఆయుధం జూలై 25: కూకట్‌పల్లి ప్రతినిధి
శుక్రవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ తో కలిసి కెపిహెచ్‌బి మరియు ఫతేనగర్ డివిజన్ లలో పర్యటించారు.ముఖ్యంగా ప్రజలు ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కూకట్పల్లి లో ఇప్పటికే గత పదేళ్ల కాలంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఫ్లై ఓవర్లు ,అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణంలు చేపట్టామని అయినా కూడా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో కొత్త ఫ్లై ఓవర్లు అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణాలు చేయడానికి ఇందులో భాగంగా వసంత నగర్ కాలనీ నుంచి గోకుల్ ఫ్లాట్స్ మీదుగా హై టెన్షన్ రోడ్డులో రైలు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, మరియు కూకట్పల్లి హుడా ట్రక్ పార్క్ స్థలము క్రీడా ప్రాంగణంగా మార్చుటకు పరిశీలన అలాగే జేఎన్టీయూ సర్కిల్ అభివృద్ధికి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి స్కై వే ఏర్పాటు చేయడం కోసం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా మూసాపేట ఆంజనేయ నగర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం మరియు కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మరియు అండర్ పాస్ నిర్మాణం కోసం చర్యలు చేపట్టే విధంగా నిర్ణయించారు . అనంతరం ఫతేనగర్ వెంకటేశ్వర నగర్ లో పాత నడక బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకోవడంతో దానికి నూతనంగా నిర్మాణం చేసేటట్లు చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందాడి శ్రీనివాసరావు. పండాల సతీష్ గౌడ్,ఎస్సీ చిన్నారెడ్డి, ఈఈ రమేష్,డిఇ శంకర్,ఎఇ రంజిత్.. తదితరులు పాల్గొన్నారు.