Site icon PRASHNA AYUDHAM

సబ్బతి మంగయమ్మ పార్థిహానికి నివాళులర్పించిన మద్దెల

IMG 20250203 WA0391

ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న స్నేహితులు పార్థివ దేహానికి ఆచార్య డాక్టర్ మద్దెల అత్యంత సన్నిహితులు మరియు జూలూరుపాడు వాస్తవ్యులు
సబ్బతి విష్ణుమూర్తి మాతృమూర్తి అయిన సబ్బతి మంగాయమ్మ పార్టీవ దేహాన్ని దర్శించి, ఘనంగా నివాళులు అర్పించిన భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్! ఘనంగా నివాళులు అర్పించిన చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్, వర్ధన్న పేట శాసనసభ్యులు నాగరాజు ,
వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చెన్నయ్య, ప్రముఖ జాతీయ అంబేద్క రిస్ట్ దిగంబర్ తదితరులు!అమ్మ అనే పవిత్ర పదానికి కొనియాడారు.

అసలు సిసలైన నిర్వచనం,అన్ని ప్రేమలలోకి అమ్మ ప్రేమ నిస్వార్ధమైనదని, నిష్కపటమైనదని, త్యాగపూరితమైనదని, అన్నిటికంటే స్వచ్ఛమైనదని, దేవుని ప్రేమలోనైనా తారతమ్యాలు ఉండవచ్చు గాని, అమ్మ ప్రేమలో పక్షపాతం ఉండదని,
అటువంటి నిస్వార్ధమైన ,నిష్కపటమైన త్యాగపూరితమైన ప్రేమను తన కుటుంబ సభ్యులకు ఈ సమాజానికి పంచి, అమ్మ అనే పదానికే నిలువెత్తు నిదర్శనంగా, మార్గదర్శకంగా నిలిచిన స్వర్గీయ సబ్బతి మంగాయమ్మ, మహిళ లోకానికి స్ఫూర్తిదాయకమని, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ బాలోత్సవ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు , కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.

ఇటీవల అనారోగ్యంతో పరమపదించిన డైనమిక్ పోలీస్ ఆఫీసర్ శ్రీ సబ్బతి విష్ణుమూర్తి మరియు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ శివ మూర్తి మాతృమూర్తి
స్వర్గీయ మంగాయమ్మ పార్టీవ దేహాన్ని జూలూరుపాడు లో గల వారి స్వగృహంలో ఉంచగా, ఆచార్య డాక్టర్ మద్దెల తన బృందంతో వెళ్లి, పార్థివ దేహాన్ని దర్శించి , పూలమాలలతో పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు

మధుర మూర్తి ప్రేమ మూర్తి త్యాగమూర్తి మాతృమూర్తి స్వర్గీయ సబ్బతి మంగాయమ్మ అమర్ రహే! అమర్ రహే !అనే నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారు మ్రోగింది!

ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ , స్వర్గీయ సబ్బతి మంగాయమ్మ కొన్ని విలువలతో జీవించిన గొప్ప మాతృమూర్తి అని,
తన పిల్లలను పెంచడంలో కూడా, ఆ ఉత్తమ విలువలను ఆపాదించి, అత్యున్నత విద్యలను అభ్యసింపజేసి , సమాజంలో ఉన్నతమైన స్థానాలను వారికి కల్పించి , సమాజ హితానికి తోడ్పడే వారిగా తీర్చిదిద్దడంలో స్వర్గీయ మంగాయమ్మ గారి కృషి ఎంతో ప్రశంసనీయమైనదని, అందువలననే శ్రీ విష్ణుమూర్తి లాంటి డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ని పోలీసు వ్యవస్థకు, అభ్యుదయ భావాలు , సామాజిక దృక్పథం కలిగిన డైనమిక్ జర్నలిస్ట్ శ్రీ శివ మూర్తి గారిని జర్నలిస్టు వ్యవస్థకు, అంతేగాక ఉపాధ్యాయురాళ్ళుగా, కవయిత్రులుగా , ఈ సమాజానికి సేవలు అందించడానికి శ్రీమతి సుమిత్ర దేవి ని శ్రీమతి కౌసల్య దేవి ని అందించారని,

అంతేకాకుండా అటువంటి కన్నతల్లి రుణాన్ని తీర్చుకోవడానికి, ఆమె వ్యాధిగ్రస్తురాలు అయినప్పటికీ రెండు సంవత్సరాల నుండి, కుమారులు శ్రీ విష్ణుమూర్తి, శ్రీ శివ మూర్తి ఇద్దరు, ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ వైద్యాన్ని అందిస్తూ, రెండు సంవత్సరాలు ప్రయాసపడ్డారని ఇది ఎంతో గొప్ప తల్లికి అందించే సేవ అని ,

తనకు ఈ కుటుంబం ఎంతో సన్నిహితమైన బంధుత్వం కలిగినదని, తరచూ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ కన్నతల్లి యొక్క అవ్యాజనురాగమైన ప్రేమను, మరియు మధురమైన వంటకాలను రుచి చూసినానని, ఆ తల్లిచే నేను కూడా ఎన్నో ప్రశంసలు పొందిన వాడనని ఆనాటి రోజులను ఆచార్య డాక్టర్ మద్దెల గుర్తు చేసుకున్నారు

అనంతరం తన కన్నతల్లి ప్రేమ త్యాగాలను మననం చేసుకుంటూ, ఆచార్య డాక్టర్ మద్దెల, తన కన్నతల్లి స్వర్గీయ వెంకటమ్మ పై స్వయంగా రాసిన ,” జన్మనిచ్చిన తల్లి నీకు వేల వందనాలు! బ్రతుకు నేర్పిన తల్లి నీకు కోటి వందనాలు”!! అనే అద్భుతమైన గీతాన్ని, హృద్యంగా ఆలపించి , స్వర్గీయ మంగాయమ్మకు అంకితం ఇచ్చి ,అందరిని అలరించారు.

చివరగా ప్రముఖ బుద్దిస్ట్ అయినా యోగ మాస్టర్ శ్రీమతి కొచ్చర్ల కమలా రాణి, బుద్ధుని బోధనలతో సందేశాన్ని అందించి, అంతిమయాత్రను ప్రారంభించారు.
సబ్బతి కుటుంబానికి ఉన్న మంచి పేరు ప్రతిష్టలను బట్టి , ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి జన సందోహం సముద్రంలా కదిలి, స్వర్గీయ సబ్బతి మంగాయమ్మ కి ఘనమైన నివాళులర్పించారు.
గిడ్ల పరంజ్యోతి రావు, మాల మహ
మాల మహానాడు జాతీయ అధ్యక్షులుచెన్నయ్య ,
ప్రముఖ జాతీయ అంబేద్కరిస్ట్ దిగంబర్
రాష్ట్ర నాయకులు రాజశేఖర్, ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపీనాథ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జె బి శౌరి,
సింగరేణి ఏజీఎం గోనె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version