Headlines :
-
“మధిరలో ఆధార్ సేవలు నిలిచిపోవడం ప్రజలకు తలనొప్పిగా మారింది”
-
“ఆధార్ సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి: మధిర ప్రజల వేదన”
-
“మధిరలో ఆధార్ కేంద్రం లేకపోవడం విచిత్రం: తక్షణ చర్యల కోసం ప్రజల డిమాండ్”
-
“పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవల నిలిపివేతపై మధిర ప్రజల ఆగ్రహం”
-
“మధిరలో ఆధార్ సేవలు రీప్రారంభానికి వెంటనే చర్యలు తీసుకోండి: ప్రజల విజ్ఞప్తి”
*మధిరలో ఆధార్ సేవలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారం క్రితం మధిర పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవలు ప్రారంభం అయినవి అని ప్రచారం జరిగి ప్రజలు పోస్ట్ ఆఫీస్ కు వెళ్లినప్పటికిని మూణ్ణాళ్ళ ముచ్చటగా, కంప్యూటర్ పనిచేయడం లేదు ఆధార్ సేవలు క్లోజ్ చేసాము అని పోస్టల్ అధికారులు చెబుతున్నారు. మధిర లో ఆధార్ సేవలు అందక ఖమ్మం, విజయవాడ, హైదరాబాదు లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. మధిర నియోజకవర్గ కేంద్రం అయినప్పటికినీ, సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నియోజకవర్గమైనప్పటికినీ ఆధార్ కేంద్రం లేకపోవడం విడ్డూరంగా ఉన్నదని, అధికారులు, రాజకీయ నాయకులు వెంటనే స్పందించి మధిరలో ఆధార్ సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.*