*మధ్యప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి (ఐఏఎస్) జన్మదిన వేడుకలు*
*జమ్మికుంట మార్చి 1 ప్రశ్న ఆయుధం*
మధ్యప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి (ఐఏఎస్) జన్మదిన వేడుకలను జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని శివాలయం(బొమ్మల గుడి)లో ఘనంగా నిర్వహించారు అన్నపూర్ణ సేవాసమితి నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణసాగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సీనియర్ జర్నలిస్ట్ నసీరుద్దీన్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బసంత్ నగర్ కు చెందిన పరికిపండ్ల నరహరి ఐఏఎస్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూనే ఆలయ ఫౌండేషన్ సంస్థను స్థాపించి పేద ప్రజల కోసం అనేక సామాజిక కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుందన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు చదువు కోసం ఆర్థిక సాయం అందించడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొంది పేద ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు తనకు కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సమ్మెట సదానందం నేరెళ్ల రఘుపతి మేకల గణేష్ కొండపాక అశోక్ అబ్బరవేన రాజు, కొంగల కుమార్ ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గుణసాగర్ సభ్యులు ఇంగిలే రామారావు తో పాటు తదితరులు పాల్గొన్నారు.