మాదిగల విజయోత్సవ ర్యాలి లో పాల్గొన్న మాదిగ జర్నలిస్టులు
గజ్వేల్ ఆగస్టు 13 ప్రశ్న ఆయుధం :
ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి చిరకాల కోరిక సాధించుకున్న శుభ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో మాదిగల విజయోత్సవ ర్యాలీ కి బయలుదేరిన ఉమ్మడి మెదక్ జిల్లా మాదిగ జర్నలిస్టులు అదిక సంఖ్య లో తరలి వెళ్లారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుండి తెలంగాణ గడ్డ హైదరాబాద్ మహానగరానికి చేరుకున్న సందర్భంగా లక్షలాదిమంది మాదిగలు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికి బారి ర్యాలి లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శి మరాటి కృష్ణమూర్తి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్, ఎం జె ఎఫ్ నేతృత్వంలో ఎన్నో దీక్షలు పోరాటాలు చేసి చిరకాల కోరిక వర్గీకరణ సాధించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్. రాష్ట్ర కార్యదర్శి దశరథ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ డి. అశోక్, రాష్ట్ర కార్యదర్శి దశరథ్ ,రాష్ట్ర నాయకులు మొండి బిక్షపతి, జిల్లా నాయకులు చేబర్తి సత్యం, ఎమ్మార్పీఎస్ నాయకులు నత్తి రామకృష్ణ, బలిపురం యాదగిరి సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.