ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ మాదిగల కళా ప్రదర్శన

*ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ మాదిగల కళా ప్రదర్శన*

*హుజురాబాద్ జనవరి 15 ప్రశ్న ఆయుధం* 

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వెయ్యి గొంతుకలు లక్ష డప్పుల మాదిగల మహా ప్రదర్శన బుధవారం సాయంత్రం హుజురాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర రామంచ భరత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు డప్పు కళాకారులు, గాయకులు కలిసి ప్రభుత్వ ఆసుపత్రి నుండి అంబేద్కర్ విగ్రహం దగ్గరకు డప్పులు వాయిస్తూ, పాటలు పాడుకుంటూ చేరుకున్నారు అనంతరం ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రుద్రారపు రామచంద్రం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ను సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే వెయ్యి గొంతులు లక్ష డప్పుల మాదిగల మహా ప్రదర్శన జయప్రదం చేయుటకు హుజురాబాద్ నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఎస్సీ వర్గీకరణకు సమాజంలో ఉన్న అన్ని వర్గాలు నాయకులు ప్రజలు సమర్ధించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాదిగ కళా మండలి జిల్లా అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ (ప్రభు), రాం రాజేశ్వర్, యంఎస్పి రాష్ట్ర నాయకుడు మారేపల్లి శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్, ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, ప్రధాన కార్యదర్శి దేవునూరి రవీందర్, డాక్టర్ తడికమల్ల శేఖర్, ఇల్లందుల సమ్మయ్య, వేల్పుల ప్రభాకర్, బొడ్డు ఐలయ్య, బత్తుల రాజలింగం మొలుగూరి కొమరయ్య, దానంపల్లి ఐలయ్య, మీడిదొడ్డి శ్రీనివాస్ బొరగాల సారయ్య, ఆకునూరి అచ్యుత్, మేకల మొగిలయ్య, కుక్కముడి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now