*మూడు దశాబ్దాలకు నెరవేరిన మాదిగల కల*
*మందకృష్ణ మాదిగ శరత్ భరత్*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 1*
మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా చేసిన అలుపెరుగని పోరాటాలు నేడు సుప్రీంకోర్టు తీర్పుతో 59 మాదిగ ఉపకులాలలో హర్షాతి రేఖలు వెళ్లి బుచ్చాయి 1994 జూలై 7వ తారీఖు నాడు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో రిజర్వేషన్ ఫలాలు 59 మాదిగ ఉపకులాలకు సమానంగా దక్కాలని ఏడుగురుతో మొదలైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సుదీర్ఘంగా 30 సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అలుపెరుగని పోరాటం చేసి అనేక విజయాలు సాధించి ఎన్నో అవమానాలు ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో మాదిగల్లో చైతన్యం నింపిన మందకృష్ణ మాదిగ చేసిన అలుపెరుగని పోరాట ఫలితమే నేడు సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిందని ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కెరటం డి బి ఎస్ ఏ డ్రీమ్ డ్రం బహుజన యాది సభ సంఘాల వ్యవస్థాపకులు డాక్టర్ నలిగంటి శరత్ చమార్ ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు రామచ భరత్ అన్నారు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందక విద్యకు ఉద్యోగాలకు రాజకీయ రంగాలకు దూరమై ఒక్క తరం నష్టపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలైన ఎస్సీ వర్గీకరణతో దాదాపు 22 వేల ఉద్యోగాలు మాదిగలకు దక్కాయని అదే విధంగా అనేక రంగాలలో లబ్ధి పొందారని వారు గుర్తు చేస్తూ వర్గీకరణను అమలు చేసిన ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దూర దృష్టితో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయిందన్నారు భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రత్మకమైన తీర్పు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు