Site icon PRASHNA AYUDHAM

వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన మాదిరి ప్రిథ్వీరాజ్

IMG 20251016 212417

Oplus_131072

సంగారెడ్డి/పటాన్ చెరు అక్టోబర్ 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్‌చెరు పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో చిన్నారుల కోసం నిర్వహించిన ఫీల్డ్ ట్రిప్ లో విద్యార్థులు సేంద్రియ వ్యవసాయం పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ తెలిపారు. పటాన్ చెరు పట్టణంలోని జె.పి ఫార్మ్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రిథ్వీరాజ్ సమక్షంలో విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత, సేంద్రియ ఎరువుల వినియోగం, పంటల పెంపకం విధానాల గురించి వివరణాత్మకంగా తెలియజేశారు. చిన్నారులు స్వయంగా పంట పొలాలను సందర్శించి, వరి పంట, కూరగాయ పంటలు, కొబ్బరి చెట్లు, టేకు చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు, ఉసిరికాయ, నిమ్మకాయ, మునక్కాయ, పాలకూర, తమలపాకు మొదలగునవి సేంద్రియ పంటలు ఎలా పండుతాయో నేర్చుకున్నారు. ఇలాంటి ఫీల్డ్ ట్రిప్స్ పిల్లల్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించడమే కాకుండా, సుస్థిర వ్యవసాయం వైపు కొత్త తరం దృష్టిని మలుస్తాయని ప్రిథ్వీరాజ్ అన్నారు.

Exit mobile version