మద్నూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవం

ప్రమాణస్వీకార
Headlines
  1. మద్నూర్ మార్కెట్ కమిటీకి మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలు
  2. మద్నూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారం: ఘనంగా ప్రారంభం
  3. జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ: మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయాలని సూచన
  4. కాంగ్రెస్ పార్టీ నేతలు మద్నూర్ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారంలో
  5. మద్నూర్ మార్కెట్ కమిటీలో పారదర్శకత కోసం ఎంపిక విధానం – మంత్రి జూపల్లి కృష్ణారావు
ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

డిసెంబర్-07

మద్నూర్ మండల మార్కెట్ కమిటీ పలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఎక్సైజ్ & పర్యాటక శాఖ మరియు నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు..

మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. అనంతరం భారీ ర్యాలీగా గురు ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు..

మంత్రికి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలు కప్పి, పుష్ప గుచ్చాలు అందజేసి ఘనంగా సన్మానించారు..

అనంతరం మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అయిల్వార్ సౌజన్య, వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ మరియు డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు..

ఈ సందర్భంగా మంత్రి నూతన కమిటీని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు..

మార్కెట్ కమిటీ చైర్మన్ ల పదవులలో పారదర్శకత కోసం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటర్వ్యూ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ని మంత్రి అభినందించారు..

పదవులు రావడం సహజమే కానీ వాటిని సమర్థవంతంగా, అంకితభావంతో నిర్వర్తించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు..

మార్కెట్ కమిటీ సభ్యులు అందరూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న కరీంనగర్ జిల్లాలోని ముల్కనూరు సొసైటీని సందర్శించాలని సలహా ఇచ్చారు..

సభ్యులందరూ సమిష్టి కృషితో మద్నూర్ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేసి మంచి గుర్తింపు తీసుకొచ్చే విధంగా పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు..

రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు..

రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణాలు అన్నీ మాఫీ చేశామని, సన్నాలకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని, అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసిన మూడు, నాలుగు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, వారు చేసిన అప్పులకు కూడా వడ్డీలు కడుతూ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు..

అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను, ప్రజా ఉద్యమాలను అణచివేసిందని, నిర్భంధాల నడుమ పరిపాలన కొనసాగించిందని విమర్శించారు..

ప్రజా ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని, ధర్నాలు నిరసనలు తెలుపుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించామని తెలిపారు..

పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు..

ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్,డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now