సింగరేణి: సింగరేణిలో పరీక్షలు నిర్వహించిన ప్రతిసారి తప్పులు జరిగాయని ఆరోపణలు రావడం సర్వసాదరమైందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ విమర్శించారు.సింగరేణి ఇటీవల నిర్వహించిన పరీక్షలో జరిగిన తప్పిదాలపై పరీక్ష రాసిన అభ్యర్థులతో కలిసి హెడ్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు రిజర్వేషన్ తో యువకులకు చేజారిన ఉద్యోగ అవకాశాలు.తప్పులతడగా ప్రశ్న పత్రాల ‘కీ’
మహిళా రిజర్వేషన్స్ మరియు ,కీ లోని తప్పుల వల్ల మేనేజ్మెంట్ ట్రైనీ ఎగ్జామ్ రాసిన మైనింగ్ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏడు సంవత్సరాల తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ ఉద్యోగల భర్తకి విడుదల చేసిన నోటిఫికేషన్ వల్ల నిరుద్యోగులకు నష్టమే తప్ప లాభమే లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.సింగరేణి మేనేజ్మెంట్ ట్రైని (మైనింగ్)
1.3.2024 నాడు నోటిఫికేషన్
విడుదల చేసింది.ఉద్యోగ నియామకాల వ్యవహారం అంతా ఈ డి సి ఐ ఎల్ సంస్థకు అప్పగించిన సింగరేణి యాజమాన్యం.సింగరేణి మేనేజ్మెంట్ ట్రైని
(మైనింగ్) పోస్టులకు డి సి ఐ ఎల్ సంస్థ
21.07.2024 రోజున ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించారు.అనతరం
7.9.2024 రోజు ప్రశ్న పత్రాల కీ విడుదల చేసారు అదేవిదంగా రెస్పాన్స్ షీట్ విడుదల చేశాడు.తప్పు ఒప్పులపై ఒక పోర్టల్ ఓపెన్ చేశారు
ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు తప్పు ఒప్పులపై అభ్యంతరాలు తెలియజేశారు.ప్రశ్న పత్రాల కీ తప్పులతడగా ఉందని స్టాండర్డ్ మైనింగ్ బుక్స్ లోని ప్రశ్నలకు కూడా కి లో తప్పులు గా చూపించారని అభ్యర్థులు ఆరోపించారు.10.9.2024 రోజు కొంతమంది నిరుద్యోగులు హైదరాబాదులోని సిఎండి బలరామును కలసి కీ లో తప్పులు ఉన్నాయని సరిచేయాలని విజ్ఞాపన పత్రము అందించారు.ఈ సందర్బంగా సిఎండి బలరాం
సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ తో తప్పులను సరిదిద్దిస్తానని అభ్యర్థులకు మాట ఇచ్చారని తెలిపారు.తప్పొప్పులు సరిదిద్దకుండానే 17.9.2024 లిస్టు పెట్టారని అందులో కొన్ని తప్పులు ఉన్నాయని అన్నారు.భారతదేశంలో అతిపెద్ద మైనింగ్ సంస్థ అయినా కోల్ ఇండియా లో కూడా మేనేజ్మెంట్ ట్రైని మైనింగ్ పోస్టులకు మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ లేదు.తెలంగాణలోని సింగరేణి సంస్థ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రవేశ పెట్టారు.నిరుద్యోగులైన యువకులకు అన్యాయం చేస్తున్నారు అంటున్నారు.అమ్మాయిలకు హారిజంటల్ రిజర్వేషన్ ఏర్పాటు చేయడం వల్ల మొత్తం 139 పోస్టులో గాను మహిళలకు 44 పోస్టు దక్కుతున్నాయి
4,127 మంది ఎగ్జామ్ రాశారు.
159 అమ్మాయిలు ఎగ్జామ్ రాశారని
మిగిలిన 95 ఖాళీలకు 4,075 మంది మగ నిరుద్యోగులు పోటీ పడుతున్నారని దీనివల్ల యువకులకు అన్యాయం జరుగుతుంది నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు ఫైనల్ కీ లో కొన్ని తప్పులు దొరల వల్ల నిరుద్యోగులు భారీ ఎత్తున నష్టపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం,డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కలు వెంటనే స్పందించి మరికొన్ని ఖాళీలను ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో కలిపి ప్రతిభావంతులైన నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూడాలని పోస్టుల సంఖ్యను పెంచాలని పలువురు కోరుతున్నారు
ఈకార్యక్రమంలో పరీక్ష రాసిన అభ్యర్థులు వంశీ,సంతోష్,జస్వంత్ రెడ్డి,రాజు,మహేష్ తదితరులు పాల్గొన్నారు