శివ్వంపేట మండల కేంద్రంలోని భీమ్లా తాండ గ్రామపంచాయతీ పరిధిలోని శంకర్ తండాలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ సేవాలాల్ జగదాంబ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు బాలు నాయక్, ఉపాధ్యక్షులు , జైల్ సింగ్, ప్రధాన కార్యదర్శి దశరథ్, కోశాధికారి విట్టల్, కార్యవర్గ సభ్యులు పాతులోత్ రవి ,దేవి సింగ్ మరియుకార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి శివ్వంపేట మండల మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, శివ్వంపేట మండల మాజీ పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివ్వంపేట మండల బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణారావు, సుధాకర్, నరేష్, హనుమ, మంజియా, దుర్గయ్య, పాండ్యా, వారాల గణేష్, సత్య గౌడ్, శ్రీధర్, ప్రభు లింగం గౌడ్, ఆంజనేయులు, బిక్షపతి గౌడ్, శేఖర్ గౌడ్, తండా ప్రజలు, మరియు గణపతి నవరాత్రి ఉత్సవ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
గణపతి మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం
Published On: September 11, 2024 8:03 pm
