సమగ్ర శిక్ష ఉద్యోగుల మహా పాదయాత్ర

సమగ్ర శిక్ష ఉద్యోగుల మహా పాదయాత్ర

ప్రశ్న ఆయుధం -కామారెడ్డి

కామారెడ్డి జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా 19వ రోజు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం నుంచి అమరవీరుల స్తూపం వరకు ఐదు కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి వారు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ లు మాట్లాడుతూ హనుమకొండ ఏకాశిల పార్క్ వద్ద ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, తెలంగాణ రాష్ట్రం అంటేనే త్యాగాల పురిటి గడ్డ అని, మేము తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన కాంట్రాక్టు ఉద్యోగులము అన్నారు.

IMG 20241228 WA00171

సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్రమస్తే రెగ్యులర్ అయితే అనుకున్నాము కానీ గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మోసం చేసి తమ జీవితాలను నాశనం చేశాయని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నైనా తమను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అమరవీరుల స్తూపం సాక్షిగా తమ డిమాండ్ పరిష్కారం అయ్యేవరకు సమ్మెను మరింత ఉధృతంగా కొనసాగిస్తామని, విద్య వ్యవస్థను స్తంభింప చేస్తామని అన్నారు. ఉద్యోగులు అమరవీరుల స్తూపం వద్ద ప్రతిజ్ఞ చేస్తూ తెలంగాణ సాధన పోరాటంలో చేసిన రీతిలోనే మా ఉద్యమ పంత నడుస్తుందని మా వెట్టి చాకిరి విముక్తి ఉంది వరకు మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేసేవరకు మా పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అంతరం నిజాంసాగర్ చౌరస్తాలో వున్న పోలీస్ కిష్టయ్యకు పూల మాలతో నివాళులర్పించారు.

IMG 20241228 WA0019 కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంపత్ మహిళా అధ్యక్షురాలు వాసంతి,నాయకులు శ్రీధర్ రాములు, శైలజ,సంతోష్ రెడ్డి వనజ,మంగా, శ్రీవాణి, కళ్యాణ్,సంధ్య,లింగం, కృష్ణ,దినేష్,వీణ, లావణ్య 500 మంది సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు

Join WhatsApp

Join Now