*ఈ నెల 19నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు*
శ్రీశైలం :ఏపీలోని శ్రీశైలంలో మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఫిబ్రవరి 23న బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొని మల్లన్న స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 11 రోజులు పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల అధికారులను ఈవో ఆదేశించారు.