మహాబోధి మహావిహార్ బుద్ధిస్టులకే చెందాలి

మహాబోధి మహావిహార్ బుద్ధిస్టులకే చెందాలి

ప్రశ్న ఆయుధం : మహాబోధి మహావిహార్ బోధ్ గయా విముక్తి ఉద్యమంలో భాగంగా పూజ్య భంతే బుద్ధగోష్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి పది రోజుల శ్రామినీర్ శిబిరం ఆరంభం తోపాటు శాంతియుత ధర్నా ప్రదర్శన నిర్వహించారు. జిల్లా నిజామాబాద్ ఎన్.టి.అర్ చౌరస్తా వద్ద జరిగిన ధర్నాలో స్థానిక బౌద్ధ ఉపాసక్ మహిళా ఉపాసికలు మంచి సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇట్టి ప్రదర్శన ఆలిండియా బుద్ధిష్ట్ ఫోరం, సమత సైనిక్ దళ్, బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఆలిండియా బుద్ధిష్ట్ ఆర్గనైజేషన్స్ సంయుక్తంగా శాంతిగా నిర్వహించారు. ఇందులో ప్రధాన అజెండాగా “బి.టీ చట్టం 1949” తక్షణమే రద్దు చేయాలని, మహాబోధి మహావిహార్ బుద్ధిస్టులకే చెందాలాంటూ నినాదాలు చేశారు. ఐతిహాసిక ఉద్యమం దేశ వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా సాగుతున్న విషయం భారతీయ ప్రజలకు తెల్సిందే. అయితే దేశంలోని కేంద్రం మరియు బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని బుద్ధిస్టులు కోరుతున్నారు. ఈ క్రమశిక్షణతో కూడిన శాంతియుత ధర్నాలో డాక్టర్ అంబేడ్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఇత్వార్పేట లింగన్న ఉరఫ్ డి.ఎల్ మాలజీ, అంగుళి మాలజీ పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment