Headlines :
-
మహబూబాద్ జిల్లాలో పోలీస్ మాక్ డ్రిల్: అల్లరిమూకపై పోరాటానికి సిద్ధం
-
శాంతిభద్రతల పరిరక్షణకు ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్
-
పోలీసుల ప్రదర్శన: హింసాత్మక సంఘటనలు ఎదుర్కొనే విధానాలు
ఒక్కసారిగా జిల్లా పోలీస్ కార్యాలయం యుద్ధ వాతావరణం నెలకొన్నది.
తక్షణమే ఇచ్చట నుండి వెళ్లిపోండి.
లేనిచో మీపై లాఠి ఛార్జ్ చేయబడును.
పోండి.పోండి.పోండి..అని పోలీస్ వారి హెచ్చరిక….
మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసులు మాక్ డ్రిల్స్.
శాంతిభద్రతల పరిరక్షణలొ భాగంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారి ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా సివిల్ పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసు సిబ్బందితో కలిసి ఈరోజు ఉదయం మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీసు సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎలా స్పందించాలో ప్రదర్శన నిర్వహించారు. హింసాత్మక సంఘటన జరిగితే, గుంపును నియంత్రించడానికి పోలీసులు ఎలా మొదటి హెచ్చరిక చేస్తారో చూపించారు. హెచ్చరిక వినకపోతే, వారు మేజిస్ట్రేట్ అనుమతితో బాష్పవాయువు ప్రయోగిస్తారు, తమను తాము రక్షించుకోవడానికి లాఠీ చార్జ్ చేస్తారు, ఆపై అగ్నిమాపక శాఖ వాటర్ ఫిరంగిని ప్రయోగించి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి గాలిలో పిచికారీ చేసింది – ఇవన్నీ మాక్ డ్రిల్ సమయంలో ప్రదర్శించబడుతుంది. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులను అణిచివేసేందుకు ఇలాంటి మాక్ డ్రిల్స్ ఉపయోగపడతాయ్ అని ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ తెలిపారు . జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటారని ఎస్పీ ప్రకటించారు. అలాగే అల్లర్లు సృష్టించి ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. . తరచు ఇలాంటి ‘మాబ్ ఆపరేషన్’ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు.