Headlines :
-
ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారి సూచన: రిటైర్మెంట్ తర్వాత ప్రణాళిక అవసరం
-
మహబూబాబాద్‌లో రిటైర్మెంట్ వీడ్కోలు: ముందస్తు ప్రణాళికపై దృష్టి
-
పదవి విరమణ అనంతరం ఆరోగ్యం మరియు సంతోషం కోసం ప్రణాళికలు
ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS
మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో RSI గా విధులు నిర్వహిస్తు పదవి విరమణ పొందుతున్న RSI ఏ. నరహరి గారిని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పదవి విరమణ వీడ్కోలు సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ.. ముందుగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. పదవి విరమణ తరువాత ఏమి చేయాలి అనే దానిపై ముందస్తుగా అందరు ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ముందస్తు ప్రణాళిక లేనిచో మానసికంగా ఏన్నో సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది అని తెలిపారు. మనము ప్రతి రోజు ఏదో ఒక పని చేయటము వలన మనము ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. రిటైర్‌మెంట్ అనంతరం పోలీసు శాఖ నుండి రావలసిన అన్నిరకాల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేవిధంగా చూస్తామని తెపినారు. రిటైర్‌మెంట్ అనంతరం ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మిగిలిన శేష జీవితం మీ కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
మీరు పోలీసు శాఖకు అందించిన సేవలు మరువలేనివని , ఇక ముందు మీకు ఎలాంటి సమస్య వచ్చినా మాతో సంప్రదించండి, అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డిఎస్పీ విజయప్రతాప్,ఆర్.ఐలు అనిల్, నాగేశ్వర్రావు, ఆర్.ఎస్.ఐలు పుల్లారావు, శేఖర్, సునంద,మౌనిక సిబ్బంది, వారి కుటుంబసభ్యులు పాల్గోన్నారు.