ఘనంగా మహాకవి గుర్రం జాషువా జయంతి

ఘనంగా మహాకవి గుర్రం జాషువా జయంతి

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 28, కామారెడ్డి :

సమాజంలో పేరుకుపోయిన కుల, మత, జాతి వివక్షలను గుర్తించి ఒంటరిగానే పోరాడి తన రచనల ద్వారా అణగారిన వర్గాలలో చైతన్యాన్ని రగిలించి, వారిని ప్రధాన స్రవంతిలో చేరనీయని వర్గాలపట్ల తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసిన కవి గుర్రం జాషువా. నిమ్న వర్గాలకు దీపదారియై ఆధునిక సమాజానికి కొత్త వెలుగులు నింపిన మహాకవి గుర్రం జాషువా. ఈయన జయంతిని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగు విభాగం వారు ఘనమైన నివాలులు అర్పించింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డా. కె. కిష్టయ్య, తెలుగు విభాగ అధిపతి డా. పి విశ్వప్రసాద్ తెలుగు అధ్యాపకులు కె. రవి, జి. మల్లేష్, డా. లక్ష్మణచారి, జి. శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now