- ములుగు లో ఘనంగా మహాలక్ష్మీ సంబురాలు
- ఉచిత బస్సు ప్రయాణ సంబురాల్లో పాల్గోన్న మంత్రి సీతక్క
- మహిళలకు ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు కల్పించిన ప్రజా ప్రభుత్వం
- ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ములుగు బస్టాండ్ కు చేరుకున్న సీతక్క
- ప్రయాణ సమయంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ అనుభావాలు తెలుసుకున్న సీతక్క
- ములుగు బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా ప్రయాణికులకు స్వీట్లు తినిపించి సంబురాలు నిర్వహించిన మంత్రి సీతక్క
- ఉచిత బస్సు ప్రయాణాన్ని విజయవంతం చేసిన ఆర్టీసీ సిబ్బందికి సన్మానం
- ఉచిత బస్సు ప్రయాన్ని అమలు చేస్తున్న సీఎం, డిప్యూటీ సీఎం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు మహిళా ప్రయాణికుల తరుపున ధన్యవాదాలు తెలిపిన సీతక్క
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ప్రయాణ భారం లేకండా మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలను మహిళలు పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహిళల ఉచిత ప్రయాణంతో రూ.6700 కోట్లు వారికి ఆదా అయ్యిందని..ఆ మొత్తాన్ని ఆడబిడ్డల తరుపున ప్రభుత్వమే ఆర్టీసికి చెల్లించిందన్నారు. మహిళల విజయాలను జీర్ణించుకోలేక ఉచిత ప్రయాణాన్ని బీఆఎస్ నేతలు అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు మహిళల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని…అందుకే ఉచిత ప్రయాణంతో పాటు వడ్డి లేని రుణాలు, రూ.500 కే వంట గ్యాస్, 200 యునిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పిస్తున్నట్లు చెప్పారు. ములుగులో ఆదునాతన బస్టాండ్ ను నిర్మణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారం, చుట్టుపక్కల ప్రాంతాలకు భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నందున..బస్సు సర్వీసులను పెంచాలని అధికారులకు సూచించారు. అయితే మంత్రి సీతక్క తన హోదాను పక్కన పెట్టి ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికురాలిగా ప్రయాణించి..మహిళలు, ఆర్టీసీ బస్సు, కండర్టర్ తో మాట్లాడి ఉచిత ప్రయాణంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మంత్రి తమతో పాటు ప్రయాణించి, అప్యాయంగా పలకించడంతో మహిళా ప్రయాణికుల ఆనందానికి ఆవధులు లేకుండా పోయాయి.