కామారెడ్డిలో మహాలక్ష్మి దేవి అలంకరణ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 26
నవరాత్రుల ఐదవ రోజు కామారెడ్డి పట్టణం 21వ వార్డు బీడి వర్కర్స్ కాలనీలోని కాళికామాత ఆలయంలో అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకరించి ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సంపద, సౌభాగ్యం కోసం ప్రార్థనలు చేసి ఆశీస్సులు పొందారు.