మహాలయ అమావాస్య ప్రత్యేకత

మహాలయ అమావాస్య ప్రత్యేకత

 

 

 

 

— పూర్వీకుల శాంతి కోసం పవిత్ర తర్పణాలు

 

 

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

 

ప్రశ్న వేదం సెప్టెంబర్ 21 

 

 

 

 

భాద్రపద మాసంలోని అమావాస్య రోజున జరుపుకునే మహాలయ అమావాస్యను హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు పితృ తర్పణం, పిండప్రధానం చేసి పూర్వీకులను స్మరిస్తారు. ఎవరి పూర్వీకులు ఏ తిథిలో మరణించారో తెలియకపోయినా ఈ రోజున శ్రద్ధ కర్మలు చేస్తే సంవత్సరం మొత్తం ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పితృ దోష నివారణ, కుటుంబ సుఖసంతోషాల కోసం ఈ తర్పణాలు దోహదపడతాయని పండితులు పేర్కొంటున్నారు. స్నానం అనంతరం నువ్వులు, బియ్యంతో తర్పణం చేసి, శ్రద్ధ పూర్తయ్యాక ఉపవాసం విరమిస్తారు. పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేస్తే పితృ దేవతల ఆశీర్వాదం లభిస్తుం

దని నమ్మకం.

 

 

Join WhatsApp

Join Now