బగలాముఖీ శక్తిపీఠంలో పౌర్ణిమా పర్వదినం సందర్బంగా అమ్మవారికి మహమంత్ర హావనము…..

●అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు..

●శ్రీదక్షిణమూర్తి, శ్రీవ్యాస భగవానులు, శ్రీశంకరభగవత్పాదాచార్యుల విగ్రహాలకు విశేష అభిషేక, అర్చనలు..

●అమ్మవారి భక్తులకు అన్నదానం చేసిన శ్రీగురుపీఠం పౌండర్ చైర్మన్ జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ – రమాదేవి దంపతులు…..

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 21(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

ప్రపంచంలోనే ఎక్కడ లేని విదంగా, దేశంలోనే మొట్టమొదటి సారిగా మండల కేంద్రమైన శివ్వంపేటలో బగలాముఖీ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అనతికాలంలోనే నిర్మితమై భక్తుల కొంగు బంగారమై, కోరిన కోరికేలను తీర్చడమే కాకుండా తనను నమ్మిన భక్తుల ప్రతిభందకాలను తొలగిస్తున్న శ్రీబగలాముఖీ శక్తిపీఠంలో పౌర్ణిమా పర్వదినం సందర్బంగా ఆదివారం అమ్మవారి ఉపాసకులు బ్రహ్మర్శి, శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో మహామంత్ర హావనము అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించడం జరిగినది.
@@@బగలాముఖీ అమ్మవారికి మహామంత్ర హావనము.. @@@
అమ్మవారి ఉపాసకులు వెంకటేశ్వర ఆధ్వర్యంలో పౌర్ణమ పర్వదిన సందర్బంగా ఆదివారం ఉదయం నుండి అమ్మవారికి హరిద్రార్చన అభిషేకం,అష్టోత్తర శతనామర్చనలు, మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది. శక్తిపీఠం ప్రాంగణంలోని ధ్యాన మందిరంలో బగలాముఖీ మహమంత్ర హావనము అమ్మవారి నామస్మరణతో నిర్వహించడం జరిగినది.
@@@ అమ్మవారి శక్తిపీఠంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు.. @@
బగలాముఖీ శక్తిపీఠంలో ఆదివారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శక్తిపీఠం ప్రాంగణంలోని ధ్యానమందిరంలో నెలకొల్పబడిన గురుత్రయం శ్రీదక్షిణమూర్తి, శ్రీవేదవ్యాస భగవానులు, శ్రీశంకరభగవత్పాదాచార్యులకు అమ్మవారి ఉపాసకులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష, అర్చనలు అభిషేకములు నిర్వహించడం జరిగినది.భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఒకే మందిరంలో ముగ్గురు గురుమూర్తులను ప్రతిష్టించడం ఎంతో సంతోషంగా ఉందని అమ్మవారి ఉపాసకులు అన్నారు.
*కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారి సేవలో పాల్గొన్న శ్రీగురుపీఠం చైర్మన్ శివకుమార్ గౌడ్*
పౌర్ణిమ పర్వదినం సందర్బంగా తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం బగలాముఖీ అమ్మవారి దర్శనం చేసుకున్న శ్రీగురుపీఠం పౌండర్ చైర్మన్, బగలాముఖీ ట్రస్టు సభ్యులు, జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. అనంతరం అమ్మవారి మహమంత్ర హ్వానములో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించడం జరిగినది.
*మహమంత్ర హావనములు పాల్గొన్న ప్రముఖులు…*
ఆదివారం జరిగిన బగలాముఖీ మహామంత్ర హావనములో బగలాముఖీ శక్తిపీఠం స్థలదాతలు పబ్బ రమేష్ గుప్త – స్వరూప దంపతులు, శ్రీగురుపీఠం చైర్మన్, బగలాముఖీ ట్రస్ట్ సభ్యులు శివకుమార్ గౌడ్ – రమాదేవి దంపతులు, శక్తిపీఠం ప్రధాన అర్చకులు సంతోష్ శర్మ, కొంతాన్ పల్లి మాజీ ఎంపీటీసీ ఆకుల ఇందిరా శ్రీనివాస్, ఉమా లక్ష్మీకాంతారావు, వంజరి కొండల్, బాసంపల్లి రామగౌడ్, కొడకంచి సుదర్శన్ గౌడ్, బాసంపల్లి శ్రీనివాస్, మంతురి రమేష్ గౌడ్, పోచగౌడ్,కామారెడ్డి శ్రీనివాస్, కొడకంచి రవీందర్ గౌడ్, రాజీపేట కిషన్, కొంతాన్ పల్లి సత్యనారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
*అమ్మవారి భక్తులకు శివకుమార్ గౌడ్ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం…*

ప్రతి పౌర్ణమ పర్వదినం సందర్బంగా మాదిరిగానే శనివారం జరిగిన పౌర్ణిమ పర్వదిన మహమంత్ర హావనములో పాల్గొన్న భక్తులందరికి స్వర్గీయ జిన్నారం పెద్దగౌని అంజమ్మ – లింగయ్య జ్ఞాపకర్తం శ్రీగురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ -రమాదేవి దంపతులు తమ స్వంత డబ్బులతో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

Join WhatsApp

Join Now