బగలాముఖీ శక్తిపీఠంలో అమ్మవారికి మహాపూజలు
●బగలాముఖీ ట్రస్ట్ పౌండర్ చైర్మన్, అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
●పీతవర్ణ వస్త్రాలు, పీతవర్ణ పుష్పాలతో అమ్మవారికి విశేష అలంకరణ
●రుద్రయామల బగలా అష్టోత్తర నామర్చనలతో అమ్మవారికి హరిద్రార్చన
ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 23(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
దేశంలోనే ఎక్కడ లేని విదంగా ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో దాతల సహకారంతో బగలాముఖీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమై, ప్రతి నిత్యం భక్తులకు దర్శనమిస్తున్న శ్రీబగలాముఖీ శక్తిపీఠంలో బగలాముఖీ అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం ఉదయం అమ్మవారికి మహాపూజలు నిర్వహించడం జరిగినది. అమ్మవారి ఉపాసకులు, బ్రహ్మర్శి శాస్త్రులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో శక్తిపీఠం ప్రధాన అర్చకులు సంతోష్ కుమార్ శర్మ చేతులమీదుగా అమ్మవారిని పీతవర్ణ పుష్పాలు, పీతవర్ణ వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి, అమ్మవారికి రుద్రయామల బగలా అష్టోత్తర నామర్చనలతో హరిద్రార్చన కార్యక్రమం నిర్వహించి, అమ్మవారికి అభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించి, నానా విధఫలాలతో నైవేద్యం సమర్పించడం జరిగినది. తనను నమ్మిన భక్తుల ప్రతిభందకాలను తొలగించే బగలాముఖీ అమ్మవారి దర్శనం చేసుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అమ్మవారి భక్తులకు కొడకంచి సుదర్శన్ గౌడ్ పులిహోర ప్రసాదం అందజేయడం జరిగినది.