మహారాష్ట్ర సీఎం కౌన్….?

*మహారాష్ట్ర సీఎం కౌన్….?*

మహారాష్ట్రకు కాబోయే సీఎం ఎవరు? మహాయుతి అనూహ్య విజయం దిశగా అడుగులు వేస్తూన్న నేపథ్యంలో ఇప్పటికే 210 స్థానాల్లో బీజేపీ కూటమి ఆధిక్యం సాధించింది. బీజేపీ సింగిల్ గా 100 స్థానాలు గెలుపు దిశగా దూసుకుపోతోంది. మూడు పార్టీ మహాయుతి కూటమి నుంచి ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే చర్చ షురూ అయ్యింది. 

అయితే బీజేపీ అధిక స్థానాలు గెలవడంతో ఆ పార్టీకే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్య ర్థి ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. మరి మహా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోదీ చాయిస్ పైన క్లారిటీ వస్తోంది. 

ఇక మహా ఎగ్జిట్ పోల్స్ నిజమే అయ్యాయి. మహాయుతి కూటమి ఏకపక్షంగా అధికారంపై అడుగులు వేస్తోంది. బీజేపీ నాయకత్వంలోని మహాయుతి అధికారం పీఠం చేజిక్కించుకునేం దుకు చేరువైంది. 

మహాయుతిలో బీజేపీ అధిక స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీతో పాటుగా కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న శివసేన నుంచి షిండే, ఎన్సీపి నుంచి అజిత్ పవార్ పార్టీలు అనూహ్య ఫలితాలను సాధించాయి. 

దీంతో మహాయుతి నుంచి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ మొదలయ్యింది. ప్రస్తుత ముఖ్యమంత్రి షిండే తిరిగి ముఖ్యమంత్రిగా కొనసాగు తారని శివసేన నేతలు అంచనా వేస్తున్నారు. 

ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఈ దిశగా కామెంట్స్ షురూ చేశారు. షిండే పాలన, మూడు పార్టీల సమన్వ యంతోనే ఈ స్థాయిలో భారీ విజయం సాధించా మని, చెబుతున్నారు.ఆ పార్టీ నేతలు. ఇక అజిత్ పవార్ పేరును ఆ పార్టీ నేతలు ప్రధానంగా ప్రస్తావనకు తీసుకువ స్తున్నారు. 

బారామతి నుంచి అజిత్ పవార్ భారీ మెజార్టీతో కొనసాగుతున్నారు. పవార్ రాకతోనే మహాయుతికి మంచి స్పందన కనిపిం చిందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. 

కూటమిగా మూడు పార్టల సమన్వయం ఎన్సీపీ నుం చి,వ్యతిరేకించి బయటకు వస్తూనే ఆ పార్టీకి భారీ నష్టం చేసి మహాయుతికి మేలు చేశారని గుర్తు చేస్తున్నారు. 

గతంలోనే అజిత్ పవార్ కు ముఖ్యమంత్రి పదవిపైన ఆఫర్ వచ్చిందని చెబుతు న్నారు. కానీ బీజేపీ మాత్రం తాము కూటమిలో మెజార్టీ స్థానాలు సాధించడంతో తమకే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని ధీమాగా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment