చెబర్తి లో మహాత్మా గాంధీకి ఘన నివాళి
మహాత్మా గాంధీ చిరస్మరణీయుడు : రాందాస్ గౌడ్
గజ్వేల్ నియోజకవర్గం, 30 జనవరి 2025 :
మహాత్మా గాంధీ చిరస్మరణీయుడు అని వంటి మామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్ అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో గ్రామపంచాయతీ తాజా మాజీ పాలకవర్గం, సారధి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్త ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వంటి మామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాందాస్ గౌడ్,తాజా మాజీ సర్పంచ్ అశోక్,తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామి, ఎమ్మార్ పీస్ రాష్ట్ర నాయకుడు జాలని యాదగిరి, సిద్దిపేట జిల్లా స్వేరోస్ నెట్వర్క్ అధ్యక్షులు చిన్ని కృష్ణ మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ర్యాకం యాదగిరి, మాట్లాడుతూ భారత దేశానికి శాంతి యుత మార్గంగా స్వాతంత్రం రావడానికి ముఖ్య భూమిక పోషించిన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ సిద్దేశ్వర్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం నర్సింలు సార్, మాజీ కో అప్షన్ సభ్యుడు నయిం షరీఫ్,మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ బబ్బురి రాములు గౌడ్, మాజీ ఫ్యాక్స్ డైరెక్టర్ సంజీవ్, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గ్యార మల్లేశం,జయరాం, తోట బాలకృష్ణ, గంధమల్ల తిరుపతి, తోట ఆంజనేయులు,సత్యం,నరేష్, విద్యార్థినీ విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.