బహుజన జీవితాల్లో తొలివెలుగు మహాత్మ జ్యోతిరావు పూలే

జ్యోతిరావు పూలే
Headlines
  1. బహుజన జీవితాల్లో తొలి వెలుగు మహాత్మ జ్యోతిరావు పూలే
  2. అణగారిన వర్గాలకు అక్షరాస్యత కల్పించిన మహానీయుడు
  3. కులాధిపత్య వ్యతిరేక పోరాటానికి జ్యోతిరావు పూలే స్ఫూర్తి
  4. సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడైన జ్యోతిరావు పూలే
  5. బహుజనుల చైతన్యానికి జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయం

బహుజనుల జీవితాల్లో తొలి వెలుగులు నింపిన వైతాళికుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 134 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మహాత్మా జ్యోతిరావు ఫూలే చీకటిని తరిమే వెలుతురు సామాజిక శాస్త్రవేత్త అన్నారు. సామాజిక అసమానతల్లో నలిగిపోతున్న బతుకుల్లో విద్య ద్వారా కొత్త వెలుగులు నింపిన మహానీయుడు అన్నారు. అగ్రవర్ణాల ఎదురుగా నిల్చోవడానికే సాహసించని జాతిలో పుట్టిన తరతరాలుగా తమను అణచివేస్తూ, చదువుకోకుండా అడుగడుగునా కుట్రలు సాగించిన కులాధిపత్యాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు తన జాతిని అక్షరాస్యులుగా మలిచిన వైతాళికుడు. దళితులనే అణచివేయబడ్డ వర్గాలను తమ బానిసలుగా మార్చుకున్న తీరును ఫూలే తన కండ్లారా చూశారు. జ్యోతిరావు ఫూలే కాలం నాటికి దేశంలో ఇదే పరిస్థితి కొనసాగింది. బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలాన్ని సమాజం నుంచి పారదోలేందుకు తన జాతిని చైతన్యవంతంగా తీర్చిదిద్దేందుకు తన జీవితాన్నే ధారపోసిన త్యాగధనుడు ఫూలే అన్నారు. ఆ యోధుడు సాగించిన పోరాటాన్ని బహుజనులను అక్షరాస్యులుగా చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేశారు. దేశంలో 85 శాతంగా ఉన్న బహుజనులు నేటికీ వంద శాతం అక్షరాస్యతకు చేరుకోలేక పోయారు. దేశానికి సంపదను అందిస్తూ కడుపునిండా తిండికి నోచుకోలేక ఆగర్భ దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతోంది ఈ జాతి. రాజ్యాంగం కల్పించిన అనేక హక్కులు కూడా ఈ జాతికి పూర్తిగా తెలియదంటే అతిశయోక్తి కాదు. దేశానికి ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి సైతం గర్భగుడిలోకి అడుగు పెట్టేందుకు గజగజ వణికిపోయే పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది హైందవ సంస్కృతి. బహుజనులు రాజకీయ అధికారం పొందాలన్నా, కులాధిపత్యాన్ని తరిమి కొట్టడమే ఏకైక పరిష్కారం.అప్పుడే తరతరాలుగా అణచివేతకు గురవుతూ వస్తున్న అణగారిన వర్గాలు విద్యావంతులై, అధికారంలో భాగస్వాములై సమాజంలో సమానత్వాన్ని పొందగలుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు బ్యాగరి నవీన్, విజ్ఞాన్, చాణక్య, నిఖిల్, వెంకటేష్, కనకయ్య, రాజు, యాదగిరి, శ్రీకాంత్, చంద్రయ్య, బాలయ్య, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment