గూడూరు గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మహబూబాబాద్ ఎమ్మేల్యే డా “భూక్యా మురళి నాయక్ …*
మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో గూడూరు గ్రామపంచాయతీ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహబూబాబాద్ ఎమ్మేల్యే
డా “భూక్యా మురళి నాయక్…
శంకుస్థాపన చేసిన సందర్భంగా ఎమ్మేల్యే మురళి నాయక్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి సంవత్సరం కావొస్తున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవం సందర్భంగా అన్ని గ్రామంలో పండగా వాతావరణం నెలకొల్పాలి అని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,పంచాయతీ రాజ్ మంత్రి దనసరి అనసూయ సీతక్క గారు అని గ్రామాల్లో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో మన కాంగ్రెస్ పార్టీ గ్రామపంచాయతీ భవనాలు,అంగన్వాడి కేంద్రాలకు భవనాలు,సీసీ రోడ్లు నిర్మించాలని పేదలకు బడుగు బలహీనర్గాలకు లబ్ధి జరగాలన్న సంకల్పంతో నిధులు మంజూరు చేసి అభివృద్ధికి తొడుపడుతున్న మన ప్రభుత్వానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతే కాకుండా మన ప్రభుత్వం నుండి వచ్చే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్న విషయాన్ని మన ఉర్లల్లో ప్రజలకు వాటి గురించి తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.
ఇచ్చిన హామీలలో కొన్ని పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నామని, రానున్న రోజులలో రైతు బంధు,రైతు భరోసా, మహిళలకు 2500 రూపాయల పింఛన్ పెంపు పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం కొందరికి నచ్చడం లేదని, పేద మహిళలు ఆర్థికంగా నష్టపోకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు.
రాష్ట్రంలోని పేదలందరికీ జనవరి మాసం నుండి సన్న బియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సన్న వడ్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ సైతం ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు.
ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ పథకంలో పంపిణీ చేశామని, రానున్న రోజులలో మరో 13 వేల కోట్ల రూపాయలు కేటాయించి రుణమాఫీ కానీ రైతులకు అందిస్తామని అన్నారు.
మహిళా సంఘాల వారు ఆర్థికంగా ఎదగడానికి పలు రకాల వ్యాపారులు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, ఇటీవల కాలంలో 150 బస్సులను మహిళా సంఘాలకు కేటాయించడం జరిగిందని వివరించారు.
గత పాలకులు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ ఫలాలను అర్హులకు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంటా జిల్లా సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు,యూత్ నాయకులు, గ్రామ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు