గ్రామ సభలో పాల్గొన్న తాజా సర్పంచ్ మహేందర్
గజ్వేల్ నియోజకవర్గం, 23 జనవరి 2025 :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలో ప్రజా పాలన గ్రామ సభలో పాల్గొన్న గ్రామ తాజా మాజీ సర్పంచ్ మహేందర్. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత ధోరణి లేకుండా అందరికీ సమ న్యాయం చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజా పాలన గ్రామ సభ ఫ్లెక్సీలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కెసిఆర్ ఫోటో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని, గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో గజ్వేల్ మండల రెవెన్యూ అధికారి శ్రవణ్ కుమార్ కి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.