*సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు రూ 50 లక్షల చెక్కు అందించిన మహేష్ బాబు దంపతులు*
*హైదరాబాద్:సెప్టెంబర్ 23*
ఇటీవల తెలుగు రాష్ట్రాలలో వరద బాధితు లను ఆదుకునేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుకొచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈరోజు సినీ హీరో మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మహేష్ బాబు వరద బాధితుల సాయం కోసం 50 లక్షల రూపాయల చెక్కుని అందించారు.
అలాగే AMB సినిమాస్ తరపున మరో 10 లక్షలు కూడా అందచేశారు. సీఎం రేవంత్ మహేష్ కి ధన్యవా దాలు తెలిపి శాలువా వేసి సత్కరించారు…
ఇప్పుడు సీఎం రేవంత్ భేటీలో మహేష్ ఫుల్ గా గడ్డం, జుట్టు పెంచుకొని సరికొత్త లుక్ లో కనిపించ డంతో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
ఫ్యాన్స్, నెటిజన్లు ఈ ఫోటోలను చూసి బాబు లుక్ అదిరిందయ్యా మహేష్ బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు..