Site icon PRASHNA AYUDHAM

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ జడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా

IMG 20250829 203446

నర్సాపూర్/శివ్వంపేట, ఆగస్టు 29 ( ప్రశ్న ఆయుధం న్యూస్): ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడమే తన లక్ష్యమని తాజా మాజీ జడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా అన్నారు. శివ్వంపేట మండల పరిధిలోని బిజిలిపూర్ గ్రామానికి చెందిన మొండి నర్సింలుకు ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి సహకారంతో తాజా మాజీ జడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా బాధితుడికి 51వేల రూపాయలు సీఎం సహాయనిధి చెక్కును శుక్రవారం అందజేశారు. అలాగే మండల పరిధిలోని బోజ్య తండా పంచాయతీ పరిధిలోని మాల్యా తండాకు చెందిన భానోత్ పాండు గేదెల షెడ్డు ప్రమాదవశాత్తు కాలిపోయి రెండు గేదెలు, ఐదు దూడలు మృతి చెందడంతో పాటు గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. నష్టపోయిన బాధితుడు బానోత్ పాండుకు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా తన సొంత నిధుల నుంచి 5వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో శివంపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు ముద్దగల లక్ష్మీ నరసయ్య, తాజా మాజీ సర్పంచ్ బానోత్ రాజు, కట్రాజ్ మోహన్, బాలరాజ్, బాల పరమేష్, ఫాజిల్ దొడ్ల అశోక్ , తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version