గాంధీ చౌరస్తాలో మహేష్ కుమార్ గౌడ్ దిష్టి బొమ్మ దహనం
జమ్మికుంట ఆగస్టు 26 ప్రశ్న ఆయుధం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ బిజెపి అద్యక్షుడు కొలకాని రాజు ఆద్వర్యంలో గాంధీ చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిష్టి బొమ్మ దహనం చేసి, నిరసన తెలిపారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్లో జనహిత పాదయాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలిచారని అనడం తన అవివేకానికి నిదర్శనం అని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కూడా దొంగ ఓట్ల ద్వారానే వచ్చిందో మహేష్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పాలని, కరీంనగర్ ప్రజలకు అలాగే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో కైలాసకొటి గణేష్, పల్లపు రవి, బచ్చు శివన్న, మోతె స్వామి, ఇటుకాల స్వరూప, రాకేష్ ఠాకూర్, మోడం రాజు, రాచపల్లి ప్రశాంత్, శ్రీవర్తి అఖిల్, మురికి మహేష్, యాంసాని సమ్మయ్య, ముకుందా సుధాకర్, అప్పాల రవిందర్, రామస్వామి, ఉడుగుల మహేందర్, గట్టు రాకేశ్, ఆకుల పోచయ్య, శంకర్, సిరియాల విజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు