జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్
ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :
ఎల్లారెడ్డి పురపాలక కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ సోమవారం జిల్లా పరిపాలన అధికారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎల్లారెడ్డి పురపాలక పట్టణంలోని పలు సమస్యల పట్ల జిల్లా కలెక్టర్ తో కమిషనర్ మహేష్ కుమార్ చర్చించారు.