కాంగ్రెస్ పార్టీలో చేరిన గుంటుకు మహేష్

కాంగ్రెస్ పార్టీలో చేరిన గుంటుకు మహేష్

గజ్వేల్, 03 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరేయటమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి పిలుపునిచ్చారు. గజ్వేల్ పట్టణ మాజీ సర్పంచ్ గుంటుకు రాములు చిన్న కుమారుడు గుంటుకు మహేష్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ కండువా వేసి పార్టీలో ఆహ్వానించిన నర్సారెడ్డి. అనంతరం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో రాబోయే గ్రామ పంచాయతీ, ఎంపిటిసి, జడ్పిటిసి, కౌన్సిలర్స్, సింగిల్ విండో ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే విధంగా వ్యూహరచన చేస్తున్నట్టు పేర్కొన్నారు. త్వరలో జండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కావున కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment