మృతి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇప్పించిన మహేష్ యాదవ్.

మృతి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇప్పించిన మహేష్ యాదవ్.

ప్రశ్న ఆయుధం, జులై 26 శేరిలింగంపల్లి,ప్రతినిధి

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ లో గల జనప్రియనగర్ 5 వ ఫేస్ డి బ్లాక్ లో నివసించే బిజయ నాయక్ కుమార్తె హన్సిక అనే విద్యార్థిని సెయింట్.మార్టిన్ స్కూల్ లో పదో తరగతి చదువుతుంది. ఇటీవల్ల స్కూల్ యాజమాన్యం ఒత్తిడి వల్ల హన్సిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో స్థానికులు బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు మహేష్ యాదవ్ దృష్టి కి తీసుకెళ్లగా స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి 7 లక్షల నష్టపరిహారాన్ని వారి తల్లిదండ్రులకు ఇప్పించినట్లు మహేష్ యాదవ్ తెలిపాడు. ఈ కార్యక్రమంలో

జిల్లా కౌన్సిల్ మెంబర్ బాబు రెడ్డి, మాజీ కౌన్సిలర్ రమణయ్య, డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజు, సీనియర్ నాయకులు సురేష్ కురుమ, శ్రీనివాస్ యాదవ్, సాయి రెడ్డ, బిఆర్ఎస్ నాయకుడు ధాత్రి నాథ్ గౌడ్, ఉత్కల్ సమితి సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now