*తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవ ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపు : సిపిఐ*
గజ్వేల్ సెప్టెంబర్ 18 ప్రశ్న ఆయుధం :
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సెప్టెంబర్ 20 వ తేదీన కోలాభిరామ్ ఫంక్షన్ హాల్ లో జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవ ముగింపు సభను విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కార్యదర్శి శివలింగు కృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, హుస్నాబాద్ లోని అనబేరి ప్రభాకర్ విగ్రహానికి పూలమాలవేసి మహమ్మద్పూర్ గుట్టల్లో అమరులైనటువంటి ప్రభాకర్ తో పాటు మరో 13 మందికి నివాళులర్పించి గజ్వేల్ లోని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ముగింపు సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, ఈ ముగింపు సభకు తెలంగాణ రాష్ట్ర సిపిఐ పార్టీ కార్యదర్శి కొత్తగూడెం నుండి శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరియు సిపిఐ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. కావున ఈ ముగింపు సభకు సిపిఐ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, ప్రజాసంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ పత్రిక సమావేశంలో సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు బట్టు దయానంద రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశం మరియు చింత శీను, జగదేవ్పూర్ మండల కార్యదర్శి నరసింహ రెడ్డి, ఏఐటీయూసీ గజ్వేల్ నాయకుడు జోగు లక్ష్మణ్ పాల్గొన్నారు.