ఆమ్ ఆద్మీ పార్టీ యాత్రను విజయవంతం చేయండి: ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమారాణి

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జాడు చలావ్ యాత్రను విజయవంతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ సంగారెడ్డి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమారాణి కోరారు. శుక్రవారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈనెల 15 నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ “జాడు చలావ్” యాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. జాడు చలావ్ యాత్ర రేపటి నుండి సంగారెడ్డి సాయిబాబా మందిరం నుండి యాత్ర ప్రారంభమై హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వరకు సాగుతుందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు అయిన చీపురు (జాడు) స్ఫూర్తితో అవినీతిని, అసమర్థ పాలనను తరిమికొట్టే లక్ష్యంతో ఈ యాత్ర నిర్వహిస్తున్నామని ఉమారాణి పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now