*రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్*
*ఫిబ్రవరి 7న జరిగే వేయి గొంతులు, లక్ష డప్పుల మహా కళా ప్రదర్శన ను విజయవంతం చేయండి*
*కళా మండలి జిల్లా అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ (ప్రభు)*
*జమ్మికుంట జనవరి 14 ప్రశ్న ఆయుధం*
ఫిబ్రవరి 7న హైదరాబాదులో తలపెట్టిన వేయి గొంతులు లక్ష డప్పుల మహాకళా ప్రదర్శన విజయవంతం చేయాలని కళా మండలి జిల్లా అధ్యక్షుడు అంబాల ప్రభాకర్(ప్రభు) పిలుపు నిచ్చారు ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ ఇల్లందకుంట మండలంలోని కనగర్తి ,శ్రీరాములపల్లి, సిరిసిడు ఇల్లందకుంట టౌన్లలో డప్పు కళాకారులను కలుస్తూ స్వతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలను మాలలే అనుభవిస్తూ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగ పరంగా అనుభవిస్తూ మాదిగ మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూన్న మందకృష్ణ మాదిగ పోరాటంతో ఆగస్టు 1న భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జిలతో పరిశోధనలు చేస్తే మాదిగ మాదిగ ఉపకులాలకు ఎస్సి ఎబిసిడి వర్గీకరణ జరుగుతనే ఆ జాతులకు న్యాయం జరుగుతుందని జడ్జిమెంట్ ఇస్తే తరతరాలుగా రిజర్వేషన్ ఫలాలను అనుభవించిన కొంత మంది సంపన్నమాలలు కుట్రపూరితంగా సామాన్య మాలలను ఏకం చేసి హైదరాబాదులో బహిరంగ సభ పెట్టి ఎస్సీ వర్గీకరణకు కోసం 30 ఏళ్లుగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగను విమర్శిస్తూ ఏబిసిడి వర్గీకరణను అడ్డుకోవాలని ప్రయత్నం చేయడంతో వాళ్ల కుట్రలను భగ్నం చేయడానికి వేయి గొంతులు లక్ష డప్పులతో మహాకళా ప్రదర్శన నిర్వహిస్తున్నారని తెలిపారు అందులో భాగంగా గురువారం నుండి హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట ఇల్లందకుంట వీణవంక హుజురాబాద్ మండలాలలో ప్రచార రథం రానున్నందున నియోజకవర్గం లో ఉన్నటువంటి మాదిగ మాదిగ ఉపకులాల ప్రజలు డప్పు కళాకారులు కోలాట బృందాలు ఆ రథని ఘన స్వాగతం పలికి సంఘీభావం తెలుపాలని కోరారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కోఆర్డినేటర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ రామంచ భరత్ పాల్గొననున్నారని ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రేణిగుంట్ల సాగర్, ఆదిత్య, బోయిని సమ్మయ్య కళామండలి జిల్లా ఉపాధ్యక్షులు అంబాల శ్రీరామ్, జీడి మోహన్ తారక్ డప్పు కళా బృందాల ప్రతినిధులు పాల్గొన్నారు.