Site icon PRASHNA AYUDHAM

మేళ్లచెరువు మండలం రామాపురంలో కల్తీ మద్యం తయారు

IMG 20250721 WA2127

మేళ్లచెరువు మండలం రామాపురంలో కల్తీ మద్యం తయారు చేసి ఆంధ్ర, తెలంగాణా లలో ని వైన్స్ ల ద్వారా విక్రయాలు జరుపుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఏపీ పోలీసులు.

మండలంలోని రామాపురం లో ఓ మూతబడిన రైస్ మిల్ లో స్పిరిట్, డిస్టిల్డ్ వాటర్ మిక్స్ చేసి మద్యం తయారు చేసి విక్రయిస్తుండగా ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లె లో తెలంగాణ నుంచి వెళ్లిన మధ్యం లోడు లారీ ఎక్సైజ్ స్పెషల్ ఫోర్స్ పోలీసులకు దొరికింది. లారీలో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరపగా తెలంగాణలోని హుజూర్నగర్ నియోజకవర్గం లోని మేళ్లచెరువు మండలం రామాపురంలో డొంక కదిలింది. సోమవారం ఏపీ పోలీసులు వచ్చి మిల్లులో తనిఖీలు చేపట్టి ఎక్విప్మెంట్ ని సీజ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం

Exit mobile version