Headlines in Telugu
-
మాలల హక్కుల కోసం సింహ గర్జన సభలో ఎమ్మెల్యే వినోద్ సంచలన వ్యాఖ్యలు
-
మాల జాతిని కాపాడే బాధ్యత మాపై ఉందని గడ్డం వినోద్ స్పష్టీకరణ
-
పరేడ్ గ్రౌండ్స్ జనమయం: మాలల ఉద్యమానికి భారీ మద్దతు
-
SC వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు: మాలల అభ్యున్నతికి పోరాటం
-
తెలంగాణ, ఏపీ నుండి భారీ సంఖ్యలో మద్దతుదారులు
హైదరాబాద్: మాలల కోసం మా ఫ్యామిలీ ఎంత కష్టపడ్డదో మాకు తెలుసని.. అందుకోసమే మాల కులాన్ని కాపాడే బాధ్యత మాపై ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.
ఆదివారం (డిసెంబర్ 1) హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున తలపెట్టిన మాలల సింహ గర్జన సభకు ఎమ్మెల్యే వినోద్ హాజయరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు 2024, ఆగస్ట్ 1న తప్పుడు తీర్పు ఇచ్చిందని.. ఆ తీర్పును వ్యతిరేకించేందుకు మీరంతా ఇవాళ ఇక్కడికి వచ్చారని అన్నారు.
తక్కువ సంఖ్యలో ఉన్న మాలలు ఎక్కువ దోచుకు తింటున్నారని విమర్శి్స్తున్నారని.. మాలలు ఎవరిదేం దోచుకున్నారని ప్రశ్నించారు. మా నాన్న కాకా వెంకటస్వామి కూడా మాలల అభ్యున్నతి కోసం కృషి చేశారని.. ఆయన బాటలోనే మాలల హక్కుల కోసం మేం పోరాడుతామని స్పష్టం చేశారు. కాగా, పరేడ్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన మాలల సింహ గర్జన సభకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుండి జనం తండోపతండాలుగా తరలిరావడంతో పరేడ్ గ్రౌండ్స్ జనమయం అయ్యింది. ఈ సభకు మాజీ కేంద్ర మంత్రి పాశ్వాన్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, గడ్డం వంశీ, ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ మల్లు రవి, తదితరులు హాజరయ్యారు.