Headlines :
మాల ఉప కులాల ఐక్య అభివృద్ధి సంక్షేమ సమ్మేళనం జరగనుంది
*జమ్మికుంట నవంబర్ 2 ప్రశ్న ఆయుధం::-*
ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో పద్మనాయక ఫంక్షన్ హాల్ లో జరిగే మాల ఉపకుల ఐక్య అభివృద్ధి సంక్షేమ సమ్మేళనం జయప్రదం చేయండి అని మాల ఉప కులాల ఐక్య అభివృద్ధి సంక్షేమ సమ్మేళన హుజురాబాద్ ఇంచార్జ్ శీలం రాజు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రంలో మాలలు అన్ని రంగాలలో వెనుకబడిపోయారని గత 40 సంవత్సరాల నుండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ రంగంలో కూడా అందలేదని విద్య ఉద్యోగ రంగంలో కూడా చాలా పోతున్నారని రానున్న కాలంలో విద్య వైద్య ఉపాధి వ్యాపార, రాజకీయ రంగాలలో ముందుకు కదలడానికి మాలలు ఏకం కావాలని పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం నుండి ఆదివారం కరీంనగర్ లో పద్మనాయక ఫంక్షన్ హాల్ లో జరిగే మాల ఉప కులాల ఐక్య అభివృద్ధి సంక్షేమ సమ్మేళనానికి జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి మాల ఉపకులాల మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఐపీఎస్ ఐఏఎస్ వస్తున్న తరుణంలో మాల ఉపకులాల ఐక్య అభివృద్ధి సమ్మేళన జయప్రదం చేయగలరని మేధావులు రిటైర్డ్ ఉద్యోగస్తులు న్యాయవాదులు మహిళలు, కళాకారులు యువ నాయకులు తప్పకుండా హాజరు కాగలరని కరీంనగర్ జిల్లా మాల మహానాడు నాయకుడు మేడి అంజయ్య కోరినారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ శీలం రాజు మాదాసి రాహుల్ జమ్మికుంట పట్టణ నాయకులు సుంకరి రమేష్ నూతల శ్రీనివాస్ మహేశ ప్రవీణ్, బాజాల గంగయ్య మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు